గెలుపు కాదు.. ప్రయత్నం గొప్పగా ఉండాలి…..
నాకు ఇంకా గుర్తుంది.
ఆ చీకటి పొరలు, గోడ లా ఒకదని తరువాత ఒకటి….
ఒక దాని తరువాత ఒకటి … ..
నన్ను అడ్డగిస్తూనే ఉన్నాయి
చుట్టూ చీకటి అవతల వైపు చూడాలని కుతూహలం
నన్ను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేలా చేస్తోంది
ఇది నా శక్తి కి మించిన పనే
ఐన ఓర్పు తో కొన్ని వేలసార్లు ప్రయత్నించా
ఇక చీకటి లో నుంచి బైటపడ్డ
నేను గెలిచాను అనుకున్న ప్రతీసారి
ఆశ్చర్యకరంగా, ఈ చీకటి నన్నుఆపుతోంది.
ప్రయత్నించడమో!
ఈ చీకటి లోనే ఉండిపోవడమో ఓడిపోవడమో
మళ్ళీ
ప్రయత్నించా మళ్ళీ ప్రయత్నించా
ఈ
సారి పెద్ద రాళ్ళు అడ్డొచ్చాయే
కొంచెం నిరుత్సాహం
ఎవరో పిలిచినాటు అనిపించింది
ఆ రాళ్ళ మధ్య సందులోంచి
నా ప్రయత్నం ఆ వైపు తిప్పాను
ఆ రాళ్ళ సందులో వేతకడం మొదలు పెట్టాను
అక్కడ
ఒక రకమైన చీకటి లాంటి వర్ణం నన్ను వదిలిపెట్టలేదు
ప్రయత్నంచడం
ఆపలేదు ఈసరి అన్నీ వైపులా ప్రయత్త్నించాను.
నాలో
ఆశా చావలేదు ప్రయతం ఆపలేదు
కొంత సమయం తరువాత,
ఆ రాళ్ళ మధ్య లోంచి ఏదో సంగీతం
నా మదిని తాకుతు ఉత్సాహం రేకెత్తించింది
మళ్ళీ
ప్రయత్నించా మళ్ళీ ప్రయత్నించా
కాని,
ఓకానోక దశ లో అలిసిపోయా
అలుపు
లోంచి చిరాకు.
చిరాకు
లోంచి కోపం
కోపం
లోంచి బాధ
బాధ లోంచి నిస్సహాయత
నిస్సహాయత లోంచి నిరాశ.
భరించాను భరించాను భరించాను
ఏదో సంఘర్షణ, సాదించలన్న సంకల్పం
మళ్ళీ ప్రయత్నించా మొదలు పెట్టాను
ఒక మెరుపు మెల్లగా నన్ను తాకింది
ఆ స్పర్శ నా దిషాను మార్చింది
మెల్లగా అనుసరిస్తూ ఆ స్పర్శ కోసం పరితపిస్తూ
మళ్ళీ
ప్రయత్నంచా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాను
చివరికి,
నా ప్రయత్నం ఫలించింది
ఒక
అఖండమైన వెలుగు నన్ను పైకి లాగినట్టు అనిపించింది
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-7529496793929836"
crossorigin="anonymous"></script>
<script async custom-element="amp-auto-ads"
src="https://cdn.ampproject.org/v0/amp-auto-ads-0.1.js">
</script>మాటల్లో
చెప్పలేని సంతోషం
పైకి
ఎదిగానని
గర్వంగానూ ఉంది మొదలును మర్చి పోలేదని
ఇంత కి నన్ను పరిచయం చేసుకోలేదు
భుమిని
చీల్చి అప్పుడే పుట్టిన చిన్ని మొక్కను
నాకు ఇంకా పేరు పెట్టాలెేదు.
రేపటి రోజున నీకు గాలి నీడ ఇవ్వడానికి నా ప్రయత్నం.
గెలుపు కాదు.. ప్రయత్నం గొప్పగా ఉండాలి…..
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-7529496793929836"
crossorigin="anonymous"></script>
Kindly SHARE, FOLLOW, COMMENT this post above............
